Header Banner

అన్నదాత సుఖీభవ పథకం అమలు అప్పటి నుంచే! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

  Sun Feb 02, 2025 07:00        Politics

అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం రాయచోటి సభలో మాట్లాడిన చంద్రబాబు.. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చే నిధులతో కలిసి అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. అలాగే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జూన్ నెలలో పాఠశాలలు తెరిచే లోపే తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు.  

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఒకప్పుడు ఈ-గవర్నెన్స్ అన్నామని.. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అయితే.. ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసిందని, మన మిత్రతో అనేక సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నారు. మరోవైపు నైబర్ హుడ్ కాన్సెప్ట్ కింద ఐదు నుంచి పది మంది ఉద్యోగులు ఒకేచోట కలిసి పనిచేసేలా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. టెక్ టవర్లు, కోవర్కింగ్ స్పే్‌స్‌లను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అలాగే రాష్ట్రంలో కరవు అనే మాటకు తావులేకుండా పోలవరం నుంచి బనకచర్ల వరకు, గోదావరి నుంచి పెన్నా వరకు అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీకి పెప్సీకో, వాల్ మార్ట్, లులు, డిపి వరల్డ్ లాంటి అనేక కార్పొరేట్ దిగ్గజాలను తీసుకొస్తానన్న చంద్రబాబు.. 5 ప్రాంతాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని.. మీ ఊర్లోనే కూర్చుని మీరు నాలెడ్జ్ ఎకానమీలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని వివరించారు. అలాగే ఔత్సాహికులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP